జోస్యుడుకి పార్టీ బాధ్యతలా…శరద్ పవార్ ఏంటిది?

Venu swamy selects to Andhra pradesh Sarad Power NCP party candidates

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎప్పటికైనా ప్రధాని పీఠం మీద కూర్చోవాలన్న లక్ష్యంతో రాజకీయాలు చేసిన మరాఠా నాయకుడు శరద్ పవార్ కి అది తీరని కలగానే మిగిలింది. కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగినంత కాలం ఎప్పుడోకప్పుడు ఆ అవకాశం ఎలాగోలా రాకపోతుందా అని శరద్ పవర్ ఎదురు చేసేవారట. అయితే మోడీ ప్రధాని పీఠం ఎక్కాక ఇక తనకు ప్రధాని పీఠం దక్కబోదని ఆయన డిసైడ్ అయిపోయారంట. అయితే తనకు తీరని కల ని కుమార్తె సుప్రియ పూలే ద్వారా తీర్చుకోడానికి శరద్ పవార్ వ్యూహరచన చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ని దేశమంతటా విస్తరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

NCP విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా శరద్ పవార్ దృష్టి తెలుగు రాష్ట్రాల మీద పడింది. ఇక్కడ పార్టీ వ్యవహారాలు నడిపించడానికి ఆయన నాయకుల కోసం వేట సాగిస్తున్నారు. ఆ క్రమంలో ఆయనతో కలిసి నడవడానికి అరకు ఎంపీ కొత్తపల్లి గీత సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొందరు నాయకుల్ని కూడా పవర్ సెలెక్ట్ చేసుకోబోతున్నారు. ఆ ఎంపిక బాధ్యతను ఎవరికి అప్పజెప్పారో తెలిస్తే నవ్వు వస్తుంది. వీళ్లా మన నాయకులు అని తలలు బాదుకుంటాం. పార్టీ లో చేరాలనుకునే ఎమ్మెల్యే, ఎంపీ ల గురించి ఓ నిర్ణయం తీసుకోడానికి జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తున్నారట.

వేణు స్వామి అనే జోస్యుడు ఆయా నాయకుల బర్త్ చార్ట్ చూసి విజయావకాశాలు వున్నవారిని గుర్తిస్తే వారిని ncp లోకి చేర్చుకుంటారట. ఈ విషయాన్ని వేణు స్వామి అనే జోస్యుడే ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకున్నారు. అదే నిజమైతే శరద్ పవార్ లాంటి నాయకుల మనోస్థితి మీద డౌట్ రావడం ఖాయం. దేశ రాజకీయాలు ఇంత దౌర్భాగ్య స్థితిలో వున్నందుకు, వాటిని అలా నడిపిస్తున్నందుకు శరద్ పవర్ లాంటి నాయకులు సిగ్గుపడాలి. అలాంటి నాయకుల్ని గద్దెనెక్కిస్తున్న జనం కూడా ఆత్మశోధన చేసుకోవాలి.

మరిన్ని వార్తలు:

నేనే జ‌య‌ల‌లిత కూతుర్ని

పరిటాల రవి బర్త్ డే స్పెషల్ స్టోరీ…

అమృత అమ్మకే పుట్టిందట.