బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్?

Vidya Balan in the role of Basavatarakam at NTR Movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్ జీవిత‌చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఎన్టీఆర్ లో న‌టీన‌టుల ఎంపిక వేగంగా జ‌రుగుతోంది కానీ..ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం క్యారెక్ట‌ర్ ఎవ‌రు పోషిస్తార‌నేది మాత్రం ఫైన‌లైజ్ కావ‌డం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన ఎంద‌రో హీరోయిన్ల పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. బ‌స‌వ‌తార‌కం పాత్రలో ఎవ‌రిని తీసుకోవాల‌నే దాని కోసం డైరెక్ట‌ర్ తేజ ఫేస్ రిక‌గ్నిష‌న్ టెక్నాల‌జీ కూడా ఉప‌యోగించుకుంటున్న‌ట్టు మొద‌ట్లో వార్త‌లొచ్చాయి. ఎంద‌రి పేర్లు ప‌రిశీలించినా..ఎంత టెక్నాల‌జీ ఉప‌యోగించినా…బ‌స‌వ‌తార‌కం క్యారెక్ట‌ర్ ను న‌టిని ఎంపిక‌చేసుకోవ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డిన చిత్ర‌యూనిట్ .ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ హీరోయిన్ పేరు ఖ‌రారుచేసిన‌ట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ ట్రెడిష‌న‌ల్ హీరోయిన్ గా పేరుపొందిన విద్యాబాల‌న్ బ‌స‌వ‌తార‌కం పాత్ర పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ క్యారెక్ట‌ర్ లో న‌టించేందుకు విద్యాబాల‌న్ కొన్ని కండిష‌న్స్ పెట్ట‌గా…చిత్ర‌యూనిట్ అంగీక‌రించింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. విద్యాబాల‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా ప‌రిచ‌యం లేక‌పోయిన‌ప్ప‌టికీ…ఆమెలోని నిండుద‌నం కారణంగా బ‌స‌వ‌తార‌క‌మ్మ క్యారెక్ట‌ర్ కు ఆమె స‌రిగ్గా సెట్ అవుతుంద‌ని చిత్ర‌యూనిట్ నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఈ మేరకు ఆమెను క‌లిసి క‌థ‌ను వినిపించ‌గా…స్కిప్ట్ ప‌రంగా త‌న‌కేదైతే చెప్పారో..అదే విధంగా చిత్రీక‌రించాల‌ని, త‌న‌పై చిత్రీక‌రించిన ప్ర‌తి స‌న్నివేశం సినిమాలో ఉండాల‌ని విద్యాబాలన్ కండిష‌న్ పెట్టింది. అందుకు చిత్ర‌యూనిట్ అంగీక‌రించ‌డంతో…ఎన్టీఆర్ లో న‌టించేందుకు విద్యాబాలన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.