ఆస్కార్ రేంజ్ లో రంగస్థలం ?

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాటల్లో డొల్లతనం క్రమంగా బయటపడుతోంది. వివిధ రాజకీయ, పాలనా పరమైన విషయాల గురించి లోతుగా మాట్లాడేటప్పుడు వాటి మీద తనకు పెద్దగా అవగాహన లేదని పవన్ నిజాయితీగా ఒప్పుకున్న సందర్భాలు చాలా చూసాం. అంత మాత్రాన ఆయన్ను ఎవరూ పెద్దగా తప్పు పట్టింది లేదు. సినిమాల నుంచి వచ్చాడు కదా రాజకీయాలు కూడా నేర్చుకుంటాడులే అని జనసేన అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు. కానీ పవన్ కి సినిమాల గురించి బాగా తెలుసు అనుకుంటారు వాళ్ళు. అయితే తాజాగా రంగస్థలం సక్సెస్ మీట్ లో పవన్ మాటలు చూసాక సినిమాల గురించి పవన్ పరిజ్ఞానం మీద సందేహాలు తలెత్తుతున్నాయి.

నిస్సందేహంగా రంగస్థలం మంచి సినిమా. సుకుమార్ దర్శకత్వం, చరణ్ నటన ఈ సినిమా రేంజ్ పెరగడానికి కారణం. ఈ ఇద్దరి విషయంలో పవన్ చేసిన పొగడ్తల మీద ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఉత్తరాది, దక్షిణాది అని మాట్లాడే పవన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా కలిసి రంగస్థలం సినిమాని ఆస్కార్ రేసులోకి పంపాలి అని వ్యాఖ్యానించడం మాత్రం కాస్త శృతి మించినట్టు అనిపించక మానదు. ఆస్కార్ సినిమాల స్థాయి ఎలా ఉంటుందో పవన్ కి కచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే చిత్ర యూనిట్ ని ఉత్సాహపరచడానికి ఆయన ఈ మాట వాడి వుంటారు. అయితే ఆ క్రమంలో ఆ మాటలు తన స్థాయికి తగ్గట్టు పవన్ జాగ్రత్తపడాలి. అసలే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు కూడా ….