Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాట స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న విజయ్ ఆంటోనీ తెలుగులో ‘బిచ్చగాడు’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తమిళంలో కంటే తెలుగులో ఎక్కువగా వసూళ్లు సాధించింది. దాంతో విజయ్ ఆంటోనీ తన ప్రతి తమిళ సినిమాను కూడా తెలుగులో డబ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ఎవరు కొనుగోలు చేయకున్నా కూడా తానే స్వయంగా తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఒక వైపు తమిళనాట వరుసగా చిత్రాలు చేస్తూ, ఆ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్న విజయ్ ఆంటోని తెలుగులో ఒక డైరెక్ట్ సినిమాను చేయాలని కోరుకుంటున్నాడు.
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా విజయ్ ఆంటోని ఉండడు అనేది ప్రతి ఒక్కరు ఒప్పుకునే నిజం. బిచ్చగాడు సినిమా ఏదో మ్యాజిక్ జరిగి సక్సెస్ అయ్యింది తప్ప ఆ సినిమాలో విజయ్ ఆంటోనీ ఉండటం వల్ల కాదు అనే విషయాన్ని ఆయన గుర్తించాలి. తెలుగులో ఈయన సక్సెస్‌లు దక్కించుకోవాలి అంటే మళ్లీ బిచ్చగాడు వంటి మ్యాజిక్ చేసే సబ్జెక్ట్ కావాలి. కాని అద్బుతాలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. ప్రతి సారి జరిగితే అందులో కిక్ ఏముంటుంది చెప్పండి. అలాగే విజయ్ ఆంటోని సినిమా కూడా తెలుగులో మళ్లీ ఇప్పట్లో సక్సెస్‌ను దక్కించుకుంటుందనే నమ్మకం ఏ ఒక్కరికి లేదు. ఇటీవలే విడుదలైన ‘కాశి’ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే తెలుగులో విజయాలు సాధించి, తెలుగు ప్రేక్షకుల ముందు స్టార్‌గా నిలబడాలనే తాపత్రయంను ఆయన వదులుకుంటే బెటర్ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.