స్టార్ హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా నిన్న ఆత్మహత్య చేసుకోగా…ఆమెకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెన్నై చర్చ్ పార్క్ స్కూల్లో ప్లస్ 2 చదువుతున్న ఆమె కల్చరల్ యాక్టివిటీ సెక్రటరీగా నియమించిన సమయంలో ఎంతో కాన్ఫిడెంట్గా ఆమె కి ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటే ఎవరమూ నమ్మలేకపోతున్నామని… ఆంటోనీ ధైర్యంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
కాగా, బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె ఉరేసుకుని చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నది . ఒత్తిడి కారణంగానే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. కాగా ” బిచ్చగాడు” మూవీ తో టాలీవుడ్ లో మంచి పేరుని కూడా సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ఈ సినిమా తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ వస్తుంది. ఇక నిన్న బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె ఉరేసుకుని మరణించడం తో ఆయన కుటుంబం మొత్తం విషాదం లోకి .వెళ్ళిపోయింది .