విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రం మంచి విజయం సాధించింది. సినిమా బాగుండదేమో అంతా అనుకుంటున్న సమయంలో విడుదలైన ట్యాక్సీవాలా పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 25 కోట్ల షేర్‌ను దక్కించుకుంది. రికార్డు స్థాయి వసూళ్ల దిశగా ఈ చిత్రం దూసుకు పోతుంది. ఈ చిత్రం నిర్మాతలు కేవలం అయిదు కోట్లు మాత్రమే ఈ చిత్రానికి ఖర్చు చేశారట. ఆమొత్తం సినిమా విడుదలైన మొదటి రోజే వచ్చేశాయి. ఇక రెండవ రోజు నుండి వస్తున్న వసూళ్లు అన్ని కూడా లాభాలే అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నిర్మాతకు ఈ చిత్రం ద్వారా కనీసం 20 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇంత పెద్ద సూపర్ హిట్ మూవీకి విజయ్ దేవరకొండ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే.
‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నా కూడా ఈ చిత్రానికి కేవలం 40 లక్షల పారితోషికంను మాత్రమే విజయ్ తీసుకున్నాడట. గీత గోవిందంతో పోల్చితే ఈ చిత్రంకు కాస్త తక్కువ అని చెప్పుకోవాలి. గీత గోవిందం చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో కూడా మరోసారి సూపర్ హిట్‌ను దక్కించుకున్నాడు. ఇంతగా సక్సెస్‌లు వస్తున్నా కూడా విజయ్ దేవరకొండ మాత్రం పారితోషికం విషయంలో పట్టు విడుపులను చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం నటిస్తున్న డియర్ కామ్రెడ్ చిత్రంకు కూడా కోటి లోపు పారితోషికమే అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.