సినీ హీరో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై విజయ్ స్పందించాడు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను బయటపెడతానని అన్నారు . అందరితో పంచుకోవాలనుకున్నప్పుడు దాని గురించి తప్పకుండా మాట్లాడతానని తెలిపారు. దానికంటూ ఒక ప్రత్యేక సమయం, కారణం ఉండాలని విజయ్ చెప్పారు.
పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు తన గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి ని చూపిస్తుంటారని విజయ్ అన్నారు. దీన్ని తాను ఒత్తిడిగా భావించనని చెప్పారు. వార్తలని వార్తలుగానే చూస్తానని అన్నారు. అపరిమితమైన ప్రేమ ఉందో లేదో తనకు తెలియదని… ఒకవేళ ఉంటే దానితోపాటే బాధ కూడా ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే… బాధను కూడా మోయాల్సి ఉంటుందని విజయ్ చెప్పారు.