Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా ఎగవేతదారుగా ముద్రపడ్డ విజయ్ మాల్యాను ఈసారి ఎలాగైనా ఇండియా తెచ్చేస్తారట. బలమైన సాక్ష్యాలతో సీబీఐ, ఈడీ బృందం బయల్దేరిందని, కాబట్టి ఇక మాల్యా తప్పించుకోలేడని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం దగ్గర కొత్తగా వచ్చిన సాక్ష్యాలేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. రెండు నెలల క్రితమే మాల్యా బెయిల్ ను కూడా అడ్డుకోలేకపోయారు మన అధికారులు.
మాల్యా తీసుకున్న రుణాలకు ఆధారాలున్నాయి. ఆయన ఎగ్గొట్టినట్లూ ఆధారాలున్నాయి. ఇన్ని సాక్ష్యాలున్నా లండన్ కోర్టు మాల్యాకు బెయిల్ ఇచ్చిందంటే. .మన అధికారుల వాదనలో డొల్లతనమే కారణమని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాల్యాను పట్టేస్తామంటూ ఎవరూ నమ్మడం లేదు. అసలు ప్రభుత్వమూ, ప్రతిపక్షమూ చేతులు కలిపి మరీ మాల్యాను లండన్ ఫ్లైటెక్కించాయనే వాదన బలంగా ఉంది.
నేరారోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి మరో దేశంలో ఉన్నాడు. బ్రిటన్ చట్టాల ప్రకారం మాల్యాను ఇండియా తేవడం అంత వీజీ కాదు. బలమైన సాక్ష్యాధారాలతోనే అది సాధ్యం. కానీ మాల్యాకు బెయిలే ఆపలేకపోయిన సాక్ష్యాలు.. ఎలా పట్టిస్తాయో అధికారులకు తెలియాలి. క్రౌన్ సర్వీస్ అధికారులు సంతృప్తి పడితేనే.. మాల్యాను భారత్ కు అప్పగిస్తారు. మరి చూద్దాం ఈసారైనా అధికారుల గేమ్ ప్లాన్ సక్సెస్ అవుతుందేమో.
మరిన్ని వార్తలు: