Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ లో జగన్ తర్వాత ఎవరు అని అడిగితే చెప్పడానికి ఆలోచించాలి. కానీ జగన్ ఎవరి మాట వింటారు అని అడిగితే ఇంకో డౌట్ లేకుండా 100 కి 90 మంది ఆడిటర్ విజయసాయి రెడ్డి పేరు చెబుతారు. అదీ ఇప్పుడు వైసీపీ లో విజయసాయి రెడ్డికి వున్న విలువ. అసలు వై.ఎస్ కుటుంబానికి విజయసాయి ఇంత సన్నిహితం కావడానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి. కానీ అసలు కారణం మాత్రం విజయసాయి సొంతగడ్డ నెల్లూరు జిల్లా, ముత్తకూరు మండలం,తాళ్లపూడి గ్రామ ప్రజలు చెబుతున్నారు.
ఓ మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన విజయసాయి రెడ్డి కష్టపడి చదువుకున్నారంట. అప్పట్లో చాలా కష్టం అని భావించే సి. ఏ కోర్సు తేలిగ్గా పాస్ అయ్యారంట. ఆ పై వీఎస్ రెడ్డి అండ్ అసోసియేట్స్ పేరుతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టారట. అయితే చిన్నపాటి ఆడిటర్ గా వుండే విజయసాయి దశ ఓ మాజీ ఎమ్మెల్యే కూతురిని చేసుకోవడంతో తిరిగిపోయిందట. 1976 లో కడప జిల్లా, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి కుమార్తెతో విజయసాయి పెళ్లి జరగడంతో అతని జాతకమే మారిపోయిందని ఆయన వూరి వాళ్ళే చెబుతున్నారు. అత్త వారి కుటుంబం తరపున పరిచయం అయిన వై.ఎస్ రాజా రెడ్డి కుటుంబానికి విజయసాయి కొద్ది రోజుల్లోనే ఆప్తుడు అయిపోయాడట. ఆ తర్వాత ఓ ఆడిటర్ గా వారి ఆర్ధిక లావాదేవీలు చూడడంతో ఆ బంధం ఇంకా బలపడిందట. ఇక వై.ఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్న కేసుల వ్యవహారాలు అన్ని విజయసాయి కనుసన్నల్లోనే జరిగాయట.
విజయసాయి గురించి ఈ విషయాలు ఆయన సొంత వూరు తాళ్లపూడి వాసులే చెబుతున్నారు. తమ వూరి నుంచి వెళ్లి ఎదిగిన వాడి గురించి గొప్పగా చెప్పుకోవడం పల్లెల్లో సహజంగా కనిపిస్తుంది. కానీ విజయసాయి సొంత వూళ్ళో ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేదేమో గానీ ఇప్పుడు లేదు. ఊరికి వీసమెత్తు సాయం కూడా చేయలేదని వారికి కోపం. పైగా ఎప్పుడూ ఊరికి కూడా రాడని అక్కడి వాళ్ళు చెబుతున్నారు. చివరకు నెల్లూరు జిల్లాలో జగన్ టూర్ వున్న విజయసాయి అక్కడికి రాకుండా తప్పించుకుంటాడని ఆయన వూరి వాళ్ళే అంటున్నారు. అయినా ఏదో రకంగా కొంత ఇదిగాక సొంత ఊరిలో గుర్తింపు కోసం ఎవరైనా తాపత్రయపతారు. కానీ విజయసాయి అందుకు భిన్నంగా సొంత వూరు అంటేనే ఆమడ దూరంగా ఉండటం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
మరిన్ని వార్తలు: