మెగా హీరో సినిమాలో విజయ్ సేతుపతి విలన్ !

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా మొదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే వైష్ణవ్ తేజ్ తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన జాలరిగా కనిపించనున్నాడనే విషయం ఫస్ట్ లుక్ లోనే అర్ధమయ్యింది. జాలరుల జీవితం నేపథ్యంలోనే ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరనే విషయం తెలుసుకోవడానికి అంతా ఆసక్తితో వున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ తరహా పాత్రను విజయ్ సేతుపతి అయితేనే సరిగ్గా సరిపోతాడనే ఉద్దేశంతో ఆయనను అడగడం ఆయన వెంటనే ఓకే చెప్పేయడం జరిగిందట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. బుచ్చి బాబు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో అసిస్టంట్ గా పనిచేశారు.