ప్రపంచకప్‌లో గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటికే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. భువనేశ్వర్ కూడా గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఇప్పుడు భారత జట్టులో మరో ఆటగాడు ఈ జాబితాలో చేరాడు. కాలి వేళ్ల గాయం కారణంగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ టోర్నీ నుంచి వైదొలగనున్నాడు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం విజయ్ శంకర్ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. నెట్స్‌లో సాధన చేస్తుండగా బుమ్రా వేసిన యార్కర్ విజయ్ కాలి వేళ్లకు బలంగా తాకింది. ఆ తర్వాత కోలుకున్న శంకర్ అఫ్గాన్‌తో మ్యాచ్ కూడా ఆడాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలంకావడంతో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు శంకర్ స్థానంలో రిషబ్‌పంత్‌ను తీసుకున్నారు.