Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ మీద కాల్పుల కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. కాల్పుల విషయం బయటికి వచ్చిన వెంటనే విక్రమ్ భార్య సిఫాలీ ఇచ్చిన ఫిర్యాదులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తపై కాల్పులు జరిపినట్టు చెప్పారు. అయితే ఆ వెంటనే అందులో నిజం లేదన్న ప్రచారం ఊపందుకుంది. అప్పులు, డ్రగ్స్ కేసు విచారణ కి భయపడే విక్రమ్ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు ప్రచారం సాగింది. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న పూరి ఆస్పత్రికి వచ్చి విక్రమ్ ని పరామర్శించడంతో ఆ ప్రచారం ఊపు అందుకుంది. అటు విక్రమ్ భార్య చెప్పినట్టు ఎక్కడా అన్నదానం ఏర్పాట్లు జరగలేదని పోలీసులు కూడా తేల్చడంతో కేసు మొదటికే వచ్చింది.
ఈ ప్రచారానికి బ్రేక్ వేస్తూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ గొంతు విప్పాడు. తనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్టు చెప్పాడు. ఆ వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని తన వాంగ్మూలంలో కోరాడు. వేకువజాము సమయంలో కాల్పులు జరిగినప్పుడు భయంతో గట్టిగా అరిచినట్టు విక్రమ్ చెప్పాడు. ఆ అరుపులకి కిందకు దిగి వచ్చిన భార్యతో 108 కి ఫోన్ చేయమని కూడా తానే చెప్పినట్టు వివరించాడు. అయితే 108 వెంటనే రాకపోవడంతో డ్రైవర్, వాచ్ మెన్ సాయంతో భార్య తనని ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు వివరించాడు. ఈ విషయాలు బయటికి చెప్పిన విక్రమ్ భార్య సిఫాలీ ఇకనైనా తన భర్త మీద తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు చెప్పింది.
మరిన్ని వార్తలు