Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విరుష్క ముంబై రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఇటలీలో పెళ్లి, ఫిన్లాండ్ లో హనీమూన్, ఢిల్లీలో తొలి రిసెప్షన్ తర్వాత ముంబైలో జరిగిన రెండో రిసెప్షన్ కు తారా, క్రీడాలోకం తరలివచ్చింది. సెయింట్ రెజీస్ హోటల్ లోని ఆస్టర్ బాల్ రూమ్ తారల తళుకులతో కాంతులీనింది. ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ తో కలిసి కొత్త దంపతులు దిల్ సేలోని చయ్య చయ్య సాంగ్ కు వేసిన డ్యాన్స్ రిసెప్షన్ కే హైలెట్ గా నిలిచింది. ఇట్స్ ఏ విరుష్కా పార్టీ అంటూ సాగిన విందుకు బాలీవుడ్ నుంచి షారూఖ్ తోపాటు అమితాబ్ బచ్చన్ కుటుంబం, రణబీర్ కపూర్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, దర్శకుడు కరణ్ జోహార్, శ్రీదేవీ, బోనీకపూర్, కంగనా రనౌత్ తదితరులు హాజరయ్యారు.
విరాట్ తరపున క్రికెటర్లంతా విందులో పాల్గొన్నారు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి వచ్చారు. రోహిత్ శర్మ దంపతులతో పాటు మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, పుజారా, సెహ్వాగ్, సచిన్, సునీల్ గవాస్కర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే విరుష్క జోడీకి శుభాకాంక్షలు చెప్పారు. తొలుత షారూఖ్ వేదికపై ఉన్న విరుష్క దగ్గరకు వెళ్లి తన సినిమాల్లో ప్రేమకు సంబంధించిన డైలాగ్స్ ను కోహ్లీతో చెప్పించడంతో సందడి వాతావరణం నెలకొంది.
రిసెప్షన్ లో విరుష్క డ్యాన్స్ వీడియాలో నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ముంబై రిసెప్షన్ లోనూ అనుష్క డ్రెస్ హాట్ టాపిక్ అయింది. ఢిల్లీ విందులో సంప్రదాయబద్దంగా చీరకట్టులో కనిపించిన అనుష్క ముంబైలో మాత్రం హీరోయిన్ మాదిరి డ్రెస్సే వేసుకుంది. అటు దక్షిణాఫ్రికా పర్యటకోసం కోహ్లీ సేన ఇవాళ బయలుదేరి వెళ్తోంది. అనుష్క కూడా భర్తతో పాటు దక్షిణాఫ్రికా వెళ్తోంది. న్యూ ఇయర్ వేడుకల తర్వాత భారత్ తిరిగి వచ్చి షూటింగ్ ల్లో పాల్గొంటుంది.