పిక్ టాక్: విశాల్ టెంపర్ రీమేక్ ఫస్ట్ లుక్

Vishal New Movie Ayogya First Look Released

హీరో విశాల్ తెలుగువాడు అయినప్పటికీ తమిళంలో హీరోగా రాణించడమే కాకుండా, ఒక నిర్మాతగా, నడిఘర్ సంఘం ఎన్నికల్లో నిలబడి మహామహా తమిళ సీనియర్ నటులను కాదని, జనరల్ సెక్రటరీ కూడా అయ్యాడు. తన తమిళ సినిమాలన్నీ తెలుగు లో ఒకేసారి విడుదలవుతూ, మంచి విజయాల్ని సాధిస్తూ, చూడరా…మన తెలుగోడు తమిళ సీమలో సత్తా చాటుతున్నాడు అని తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా తన కెరీర్ ని మలుచుకుంటున్నాడు. విశాల్ నటించిన తాజా సినిమా పందెంకోడి-2 అంతగా విజయం సాధించినప్పటికీ, మాస్ ప్రేక్షకులను మాత్రం ఒక మోస్తరుగా అలరించి, కలెక్షన్లను సాధించింది.విశాల్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘అయోగ్య’ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజే విడుదలయ్యింది. ఈ సినిమా తెలుగులో జూ. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకి తమిళంలో అధికారిక రీమేక్.

Vishal New Movie Ayogya First Look Released

ఈ సినిమా ఫస్ట్ లుక్ తమిళ టాప్ డైరెక్టర్ మురుగదాస్ చేతుల మీదుగా చెన్నై లో విడుదల అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని, పోలీస్ జీప్ మీద కూర్చొని స్టైల్ గా ఫోజు ఇచ్చిన విశాల్ ని చూస్తే ఈ తమిళ సినిమా టైటిల్ కి జస్టిఫై చేసినట్టు ఉంది. ఈ సినిమాకి డైరెక్టర్ గా మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వెంకట్ మోహన్ అనే కొత్త దర్శకుడు పనిచేస్తున్నాడు. ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ఫైట్ కంపోసింగ్ రామ్-లక్ష్మణ్ లు చేస్తుండగా, నోటా సినిమాకి సంగీతం అందించిన సామ్.సి.ఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. టెంపర్ సినిమాలో హైలైట్ గా నిలిచిన పోసాని కృష్ణమురళి పాత్రని తమిళంలో కే. ఎస్. రవికుమార్ (నరసింహ సినిమా డైరెక్టర్) చేస్తున్నారు. సన్నీలియోన్ ఒక ఐటెం నెంబర్ కి ఆడిపాడబోతున్నట్టు తెలుస్తుంది. జనవరి కి రిలీజ్ అని ప్రకటించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా తమిళనాట విడుదల అవ్వబోతుంది.