విశ్వక్ సేన్ ‘గామి’కి 4 రోజుల్లో ఊహించని వసూళ్లు!

Vishwak Sen's 'Gami' earns unexpected collections in 4 days!
Vishwak Sen's 'Gami' earns unexpected collections in 4 days!

విద్యాధర్‌ దర్శకత్వంలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా మూవీ గామి.ఈ మూవీ లో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. అభినయ ,సమద్‌ మరియు హారిక ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గామి’ సినిమా కి ఫస్ట్ వీకెండ్‌లో తెలంగాణ, ఏపీ లో ఆడియన్స్ నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి . అయితే, 4వ రోజు వర్కింగ్ డే కావడంతో రెస్పాన్స్ చాలా వరకూ తగ్గిపోయింది. ఫలితంగా ఈ మూవీ కు తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో రూ. 51 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

Vishwak Sen's 'Gami' earns unexpected collections in 4 days!
Vishwak Sen’s ‘Gami’ earns unexpected collections in 4 days!

ఓవరాల్గా ‘గామి’ సినిమా కి ఆంధ్రా, తెలంగాణలో నాలుగు రోజుల్లో రూ. 6.62 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ మూవీ కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ మూవీ కి రూ. 9.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 20 కోట్లు గ్రాస్ వచ్చింది.ఇక, ఈ సినిమా కి 4 రోజుల్లోనే రూ. 9.53 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.47 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.