Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్లో ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత రాబోతున్న చిత్రం ‘భరత్ అను నేను’. వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తి అయ్యింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన పస్ట్‌లుక్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఇక ఈ చిత్రం టీజర్ విడుదలకు రేపు ముహూర్తంను ఫిక్స్ చేశారు.
వారం రోజుల నుండి సీఎం భరత్ విజన్‌ను మార్చి 6వ తేదీన ప్రకటించనున్నట్లుగా ప్రకటన చేస్తూ వస్తున్నారు. భరత్ విజన్ ఏంటా అని అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎంగా భరత్ ఎడ్యుకేషన్ విధానంను ప్రక్షాళన చేస్తాడని, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ చిత్రం ఉంటుందని మొదటి నుండి కూడా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతూ వస్తున్నారు. అందుకే భరత్ విజన్ అంటూ రాబోతున్న టీజర్లో మహేష్‌బాబు సీఎంగా ఎడ్యుకేషన్ కోసం తీసుకోబోతున్న చర్యలను వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ టీజర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అని, తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. భరత్ విజన్ ఏంటో రేపు సాయంత్రం ఆరు గంటలకు తేలిపోనుంది.