ఏపీలో ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం రేపింది. అయితే ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారణ జరుపుతుంది. అయితే వివేకా హత్య జరిగి ఇన్ని రోజులు అయినా ఈ హత్యకు సంబంధించిన దోషులెవరో తేలడంలేదు. అయితే ఇటీవల వివేకానందరెడ్డి కూతురు సునీత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేస్తూ, కొందరి అనుమానితుల పేర్లను కోర్ట్‌కి తెలిపిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసులో పలు సార్లు సిట్ విచారణకు హాజరైన టీడీపీ నేత హర్ష కుమార్ తాజాగా కొన్ని సంచలన నిజాలను భయటపెట్టారు. సీఎం జగన్ తనపై చేయిచేసుకున్నాడని, మాజీ మంత్రి వివేకానందరెడ్డినే తనతో చెప్పారని, ఆ విషయం అప్పట్లో సోనియాగాంధీ వరకు వెళ్ళిందని తెలిపారు. మొదట్లో వివేకానందా రెడ్డి జగన్‌కి వ్యతిరేకంగా ఉండేవారని, ఆ తరువాత జగన్ బెదిరింపులకు భయపడి వైసీపీలో చేరారని అన్నారు. వివేకాను చంపింది కుటుంబ సభ్యులే అయి ఉంటారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారని, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు.