ఛాయ్ వాలా తన ఆదాయంలో 80శాతం వరకి ఖర్చు చేసి 40మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మహ్మద్ మెహబూబ్ మాలిక్ అనే టీ షాపు యజమానిపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌కు చెందిన ఛాయ్ వాలాపై చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకోని అతడి పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.
టీ వాలా మహ్మద్ ఛాయ్ వాలా కాదు, బడా దిల్ వాలా అంటూ అభినందిస్తున్న లక్ష్మణ్ ట్వీట్‌కు స్పందించిన మెహబూబ్ మాలిక్ హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ అంటూ సమాదనం ఇచ్చాడు. సామాజిక సేవ చేయడంలో ఈ ఛాయ్ వాలా ముందు ఉండి మా తుజే సలాం పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి చాలా మందికి అండగా నిలుస్తున్నాడు. ఓటర్లను చైతన్యవంతం కోసం ఎన్నికల సమయంలో కూడా మరక మంచిదే అంటూ పలు కార్యక్రమాలు నిర్వహించాడు.