10కి.మీ. జాగ్ చేసిన మహిళా సి.ఏం.

పశ్చిమ బెంగాల్‌

“ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ క్లైమేట్‌ యాక్షన్‌” సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ పది కిలో మీటర్ల పాటు జాగింగ్‌ చేస్తున్న వీడియో వైరల్ అయింది. డార్జిలింగ్‌ కొండలపై ఉత్సాహంగా జాగింగ్‌ చేస్తూ స్థానికులను మధ్యమధ్యలో పలకరించారు.

ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే మమతా దినచర్య తెల్లవారు జామున త్రెడ్‌ మీల్‌పై నడకతో ప్రారంభం అవాల్సిందే. పర్యావరణ పరిరక్షణ, కర్భన ఉద్గారాల నియంత్రణ మొదలగు అంశాల గురించి మమతా బెనర్జీ మాట్లాడారు.

భద్రతా సిబ్బందితో పాటు జర్నలిస్టులు జాగింగ్‌ లో పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరి రక్షిస్తామని, భూ గ్రహాన్ని రక్షిస్తామని ప్రతిఙ్ఞ చేస్తూ పచ్చదనాన్ని కాపాడండి, పరిశుభ్రంగా ఉంచండని మమతా బెనర్జీ తెలియచేశారు.