ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. దీంతో ఏపీ రైతులను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మిచౌంగ్ తుఫాన్ చేసిన తీవ్ర నష్టాన్ని మరిచిపోక ముందే ఏపీకి మరో గండం ముంచుకొస్తోంది. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది.భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆగ్నేయ అరేబియాలో తుఫాన్ వాతావరణం ఉంది.
ఇది మాల్దీదీవుల పక్కనే ఉండటంతోపాటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ కారణంగా రానున్న 24గంటల్లో ఈప్రాంతంలో అల్పపీడనం ఏర్పడునుంది. రానున్న ఐదు రోజులపాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి లక్ష్యద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనము తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ఏపీ వైపుగా వస్తే డిసెంబర్ 21, 22, 23, 24, 25 తేదీల వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఈసారి తుఫాన్‌తో భారీ ముప్పు సంభవించే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రైతులు తమ పనులను డిసెంబర్ 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.