Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు

Weather Report: Big alert for the people of AP.. Heavy rains for 6 days..!
Weather Report: Big alert for the people of AP.. Heavy rains for 6 days..!

ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. దీని ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.

ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 16వ తేదీ నాటికి వాయుగుండం గా బలపడనుందని తెలిపారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీనివల్ల ఇవాళ, రేపు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని ఒకటి మరియు రెండు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి,చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు తెలిపింది.