చెర్రీ కూతురు కోసం .. ఎన్టీఆర్ కొడుకులు ఏమి చేసారంటే?

Ram Charan
Ram Charan

చాలామంది స్టార్ హీరోలు ఒకరితో ఒకరు మంచి స్నేహితులుగా ఉంటారు. వీరి కుటుంబాల్లో ఎవరి కుటుంబంలోనైనా ఎటువంటి కార్యక్రమం జరిగినా.. ఎదుటివారి ఇంట్లో కూడా మంచి జరిగినట్టు ఫీల‌వుతూ ఉంటారు. అలా ఒకరి హ్యాపీనెస్ మరొకరుతో పంచుకునే స్నేహితులలో ఎన్టీఆర్- రామ్ చరణ్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ స్క్రీన్ పై అలా కనిపించక పోయినా చాలా సందర్భాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న స్నేహభావాన్ని వ్యక్తం చేస్తారు.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంప‌తుల‌కు అమ్మాయి క్లింకార పుట్టిన సంగతి తెలిసిందే.

పెళ్లి అయిన 11 ఏళ్ల త‌ర్వాత చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త‌ల్లిదండ్రులు అవ్వ‌డంతో సినీ పరిశ్రమలోని జ‌నాల నుంచి వాళ్ల‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆ పాప‌కి ఎన్టీఆర్ తో పాటు, ఎన్టీఆర్ కొడుకులు అభయ్, భార్గవ్ అంతా క‌లిసి ఓ ఎమోషనల్ గిఫ్ట్ పంపించారట.ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటా అనుకుంటున్నారా ? . ఎన్టీఆర్ .చరణ్, ఉపాసన, క్లింకార పేరుతో గోల్డ్ డాలర్, క్లింకారకు సంబంధించిన వస్తువులను స్పెషల్‌గా ప్యాక్ చేసి బహుమతిగా పంపించారట . అలాగే ఎన్టీఆర్ ఇద్దరి కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ వాళ్ళిద్దరూ వేసిన డ్రాయింగ్స్‌ని క్లింకారకు బహుమతిగా ఇచ్చార‌ట.

ఆ డ్రాయింగ్‌లో వీళ్ళిద్దరూ క్లీంకారని చెల్లిగా ఫీల్ అయినట్టు వేశారట. రామ్ చరణ్ – ఉపాసన కూడా ఈ బహుమతి చూసి ఎమోషనల్ ఫీలై రిప్లై ఇచ్చారని స‌మాచారం. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో క్యూట్ , వెరీ నైస్ అంటు కామెంట్స్ చేస్తున్నారు.