కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీసీల గురించి ఏమి తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్‌లో మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కిషన్‌రెడ్డికి లేదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎక్కడ చేయలేదని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణని రోల్ మోడల్‌గా తీసుకొమ్మన్నారని చెప్పారు. బీసీలం అల్ప సంతోషులమని అన్నారు. విమర్శలు ప్రతి విమర్శలు వల్ల సాధించేది ఏమీ లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.





