Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
What Made China Stronger Than India
ఒకేసారి పాకిస్థాన్, చైనాతో యుద్ధం చేసే సీన్ ఉంది. ఇదీ కొంతకాలం క్రితం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వేసిన డైలాగ్. కానీ ఒరిజినల్ సీన్ అలా లేదని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. పాక్, చైనాతో ఒకేసారి సంగతి దేవుడెరుగు.. ముందు చైనాతో నేరుగా తలపడే సత్తా కూడా లేదని తేలిపోయింది. మన సైన్యం ధైర్యసాహసాల విషయంలో ఎవరికీ అనుమాల్లేకపోయినా.. యుద్ధ సామాగ్రి మాత్రం చైనాతో పోటీగా లేవని, దీనికి ప్రభుత్వాల్నే నిందించాల్సి ఉంటుందని నిపుణులు మొత్తుకుంటున్నారు.
1962 చైనా యుద్ధంలో కూడా డ్రాగన్ సైన్యం ఎక్కువ ఉండటం కారణంగా మనం ఓడిపోలేదని, మందుగుండు కొరతతోనే అవమానం మిగిలిందని గుర్తుచేస్తున్నారు. మన సైనికులకు సరైన వసతులు కల్పిస్తే.. ఒక్కొక్కరు పది మందిని చంపగలరు. ఆ లెక్కన మన సైన్యం ప్రపంచంలోనే బలమైనది, శక్తివంతమైనది. ఎందుకంటే అతి ఎత్తువ ఎత్తులో, అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతల్లో యుద్ధం చేసే సామర్థ్యం ఒక్క భారత్ సైన్యానికే ఉంది. పైగా చైనా అనుపానుల్ని దెబ్బతీయగలిగే వ్యూహాలు కూడా ఇప్పటికే రెడీగా ఉన్నాయి.
నిజంగా చైనా భారత్ పై యుద్ధం చేస్తే.. కాగితాల మీద బలం డ్రాగన్ కే ఎక్కువుంది. కానీ మైండ్ గేమ్ తో ప్రత్యర్థిని దెబ్బతీసే తెలివితేటలు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కేవలం ఇరవై మంది సైనికులు ఓ పటాలంగా ఏర్పడి.. చైనా రెజిమెంట్ ను కూడా దెబ్బ కొట్టగలరని గత యుద్ధాల్లో కొన్ని ఘట్టాలు నిరూపించాయి. ప్రాపర్ గా ప్లాన్ చేస్తే.. చైనాను కూడా ఓడించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు:
వైఎస్ బ్రాండ్ తమదేనంటున్న కాంగ్రెస్
నంద్యాల గెలుపుపై లగడపాటి ఏమన్నారు..?