“బింబిసార 2” ఆరంభం ఎప్పుడంటే ..!

“బింబిసార 2” ఆరంభం ఎప్పుడంటే ..!
Cinema News

నందమూరి యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన రీసెంట్ సినిమాలు చూసుకుంటే డిఫరెంట్ అటెంప్ట్ లని తాను చేస్తున్నాడు. మరి ఈ సినిమా ల్లో అయితే ఇప్పుడు “డెవిల్” అనే మరో భారీ సినిమా తో తాను వస్తుండగా ఈ సినిమా రిలీజ్ కోసం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే తాను సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “బింబిసార అని చెప్పాలి.

“బింబిసార 2” ఆరంభం ఎప్పుడంటే ..!
Bimbisara-2

ఒక ఇంట్రెస్టింగ్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ని మెప్పించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా సీక్వెల్ పై కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా అప్డేట్ అందించాడు. ఈ సినిమా ని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా తెలిపాడు. దీనితో ఈ అవైటెడ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి అప్డేట్ నే అందించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం తాను నటించిన డెవిల్ సినిమా ఈ డిసెంబర్ 29 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.