‘అంబానీ’ అందలానికే మనం ఆశ్చర్యపోయాం. కానీ అంబానీని మించిన సౌకర్యాలతో ఒకాయన ఇంటిని నిర్మించుకున్నారు. ఇప్పట్లో కట్టింది కాదు. అప్పుడెప్పుడో కట్టింది. అంబానీ ఇంటినే తలదన్నే ఇల్లు ఇది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఇల్లు. ఈ ఇల్లు ఎక్కడుంది? ఎవరు నిర్మించారు? దీని ప్రత్యేకత ఏంటన్నది తెలుసుకుందాం.
భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబం నివసిస్తున్న ఇల్లు ‘యాంటిలియా’ ఇప్పటివరకూ అతిపెద్దది ఖరీదైనది అని మనం అనుకుంటుంటాం. మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు బ్రూనై సుల్తాన్ కు ఉంది. దీనిని ‘ఇస్తానా నూరుల్ ఇమాన్ అని పిలుస్తారు.
‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ ప్యాలెస్ ఎంతో విశాలమైన క్యాంపస్. ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లుగా చదరపు విస్తీర్ణం పరంగా పరిగణించబడుతుంది, ఇది భారతదేశంలోని అతిపెద్ద ఇల్లు అయిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ముఖేష్ అంబానీ యొక్క యాంటిలియా కంటే కూడా పెద్దది కావడం విశేషం.
గుజరాత్‌లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ 8 లక్షల చదరపు అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా,ముఖేష్ అంబానీ యాంటిలియా దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అయితే ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ దాదాపు 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో బ్రూనై సుల్తాన్ ప్యాలెస్ ఉండడం విశేషం. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లుగా పరిగణించబడుతోంది.
ఇస్తానా నూరుల్ ఇమాన్ అర్థం ఏంటంటే కాంతి , విశ్వాసం యొక్క ప్యాలెస్.ఈ ప్యాలెస్ లో భారీగా బంగారు గోపురాలు , భారీ గాజు తలుపులు, పచ్చిక ఉన్నాయి. ప్రపంచంలోనే పెద్ద భవనాలైన ఫర్బిడెన్ సిటీ, బకింగ్‌హామ్ ప్యాలెస్, లౌవ్రేలను మించి బ్రూనై ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది.
ఈ ప్యాలెస్‌లో 1960 నుండి బ్రూనై సుల్తాన్ కు చెందిన వాడు నివసిస్తున్నాడు. ఇందులోనే సుల్తాన్ 7000 లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. ఈ కార్ల విలువ 5 బిలియన్ డాలర్లు. ఇది భారత కరెన్సీలో రూ.41,600 కోట్లు కావడం గమనార్హం. బ్రూనై సుల్తాన్ మొత్తం నికర విలువ రూ. 2.49 లక్షల కోట్లు కాగా, ఈ ప్యాలెస్ విలువ సుమారు రూ. 11,600 కోట్లు అని సమాచారం.