పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ చేస్తున్న విమర్శలు గత కొన్ని రోజులుగా హెచ్చు మీరుతున్నాయి. పవన్‌పై వ్యాఖ్యలకు హీరోయిన్ పూనం కౌర్ స్పందిస్తూ కత్తి మహేష్‌పై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. పూనం తనను టార్గెట్ చేయడంతో కత్తి మహేష్ ఆమెను ఒక మహిళ అని కూడా చూడకుండా మరింతగా టార్గెట్ చేశాడు. ఆమె ముందు ఆరు ప్రశ్నలను ఉంచి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, పూనం కౌర్‌కు మద్య సంబంధం ఉందని, గతంలో వారిద్దరు కలిసి ఒక సినిమాలో నటించారని, కాని కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించారనే విషయం ఎవ్వరికి తెలియదు. జల్సా సినిమా నుండి పూనంను తొలగించడం, ఆమె ఆత్మహత్య యత్నం చేయడం, హాస్పిటల్ బిల్లు పవన్ చెల్లించడం ఇవన్నీ నిజం అయితే ఇన్నాళ్లు ఎవరికి తెలియకుండా ఉన్న ఈ విషయాలు ఇప్పుడు కత్తి మహేష్‌కు ఎలా తెలిశాయి అంటూ కొందరికి అనుమానం వస్తుంది.
పవన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వారికి ఈ విషయాలు తెలిసి ఉండాలి. పవన్ కళ్యాణ్ ఆప్తులుగా భావించే వారు లేదా గతంలో పవన్ పక్కన ఉన్న వారు ఇప్పుడు దూరంగా ఉన్న వారు మాత్రమే ఈ విషయాలు కత్తి మహేష్‌కు చెప్పి ఉంటారు. వారు ఎవరు అనే విషయం పక్కన పెడితే పవన్ గురించి ఇంకా ఇలాంటి విషయాలు ఎన్ని కత్తి మహేష్‌కు చేరవేస్తున్నారో అంటూ పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పబ్లిసిటీ కోసం కావాలని పూనం కౌర్ ఈ విషయాలను కత్తి మహేష్‌కు ఇచ్చి ఉంటుందని అంటున్నారు. కాని అలా జరిగేందుకు ఛాన్స్ లేదు. అది ఏమాత్రం నిజం అయ్యి ఉండదు, ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా తన వ్యక్తిగత జీవితం మీడియాలోకి రావాలని కోరుకోదు. ఒక వేళ పూనం కౌర్ ఆ విషయాను కత్తికి చెప్పి ఉంటే మాత్రం పవన్ ఫ్యాన్స్ అందుకు ఆమెపై తగిన ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం.