Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటి వరకు తమతో పొత్తు పెట్టుకుని ప్రత్య్హేక హోదా విషయంలో విభేదించి బయటకు వెళ్లి తమ మీద విమర్శలు చేస్తున్న తెలుగుదేశం మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టింది భాజాపా అగ్రనాయకత్వం. ఇప్పటికే జీవీఎల్, రాం మాధవ్ వంటి వారి చేత తెలుగుదేశం మీద మాటల దాడి చేయిస్తూ చంద్రబాబుని అవినీతిపరుడిగా ఏపీ ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘట్టంలో మరొక పాత్ర ప్రవేశించనున్నట్టు కధనాలు వెలువడుతున్నాయి. అది ఎవతో కాదు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఆయన భాజపాలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ హైకమాండ్ ఏపీ నేతలకు ముందస్తు సంకేతాలు పంపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
స్వయానా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఈ విషయంలో మాట తూలి ఈ ప్రచారానికి మరింత ఊతం ఇచ్చారు. ఏపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం జరిగాక తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించిన ఆయన తిరుమలలో రాక్జాకేయలు మాట్లాడనని చెప్పి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చేయబోతుందని 2019లో ఏపీలో.. బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారని ప్రకటించారు. కన్నా లక్ష్మినారాయణ ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తామని చెప్పిన వెంటనే .. జర్నలిస్టులు కూడా’ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణా? లేక, జేడీ లక్ష్మీనారాయణా?’ అని అడిగేశారు. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని పేర్కొన్నారు.
నిజానికి సీబీఐ మాజీ జేడీ బీజేపీలోకి వెళ్తానని ఎప్పుడూ ప్రకటించలేదు. కనీసం చర్చలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా ఎక్కడా లీక్ లేదు. అలాంటిది.. ఆయన ప్రస్తావన వస్తే ఆయన మా పార్టీ కాదు ఆయన సీఎం అభ్యర్ధి ఏంటని ప్రశ్నించాల్సిన కన్నా అంతా హైకమాండ్ నిర్ణయం అన్నట్లు మాట్లాడటంతో… అంతర్గతంగా… బీజేపీలో సీబీఐ మాజీ జేడీని చేర్చుకునే ప్రక్రియ నడుస్తున్నట్లు ఒప్పుకున్నట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. జేడీ నారాయణ ‘సంఘ్’ వ్యక్తి అంటూ ప్రచారం కావడం, ఇటీవల ఆరెస్సెస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఈ వాదనకు మరింత ఊతమిస్తోంది. ఆయన రాజకీయ అరంగేట్రంపై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాకపోయినప్పటికీ రాజకీయాల్లో అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం జిల్లాల పర్యనటల్లో ఉన్నారు. జిల్లాల్లో ఉన్న సమస్యలను రెండు నెలలలో అధ్యయనం చేస్తానని.. ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకుటానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తానని ఇంత వరకూ నేరుగా ప్రకటించలేదు కానీ.. వ్యవసాయమంత్రిని కావాలన్న ఆకాంక్షను మాత్రం వ్యక్తం చేశారు. అయితే, ఏ పార్టీ అనేది తేలకపోయినా, ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే బీజేపీకే ఆయన ఓటేస్తారని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.