ప్రగతి నివేదన సభలో కేసీఅర్ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతారని దాదాపు అందరూ భావించారు. కానీ కేసీఆర్ వాటి ఊసెత్తలేదు. రాజకీయ పరమైన నిర్ణయాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం ఇప్పుడు మరిన్ని చర్చలకి దారి తీస్తోంది. మంగళవారం లేదా గురువారం మరోసారి కేబినెట్ భేటీ కానుంది. ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
అయితే ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ రద్దుపై మాట్లాడకపోవడానికి కారణాలు ఏమిటనే విషయం మీద విస్తృతంగా చర్చ సాగుతోంది. దీనికి ఒక కారణంగా కేసీఆర్ జాతక పిచ్చి అని కొందరు అంటుంటే మరి కొందరేమో అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించాల్సి ఉందని, మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించి, వాటిని ప్రజలకు దగ్గర చేసిన తర్వాతనే అసెంబ్లీని రద్దు చేస్తే బాగుంటుందని కీసీఅర్ వెనకడుగు వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఇదే అంశాన్ని కేసీఆర్ తన ప్రగతి నివేదన సభలో చెప్పకనే చెప్పారని విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలోనే రాజకీయ నిర్ణయాలు ఉంటాయని ఆయన అన్నారు. దీని ఉద్దేశ్యం.. త్వరలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకొని, ఆ తర్వాత రద్దు చేసే ఉద్దేశ్యమే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.