గొడవపడ్డ భార్య లిప్ కిస్ ఇస్తే నాలుక కొరికేసింది!

Wife Bites Off Husband Tongue

తనతో గొడవ పడుతోన్న భార్యను కిస్ చేసి కోపాన్ని చల్లార్చాలని భావించిన భర్తకు ఆమె ఊహించని షాక్ ఇచ్చింది. అలక మీద ఉన్న భార్య పెదవులకు లిప్ లాక్ ఇచ్చాడు ఓ యువకుడు అదే అదునుగా భావించిన భార్య తన భర్త నాలుకను కసిగా కొరికింది. అంతే దెబ్బకు నాలుక తెగిపోయింది. భార్యచేసిన ఈ నిర్వాకానికి నాలుక తెగిపోయి తీవ్ర రక్తం రావడంతో భర్త ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన దేశ రాజధానిలోని రణ్‌హోలాలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు, భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టిస్టుగా పనిచేసే కరణ్‌ (22)కు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ పెళ్లి ఇష్టంలేని అతడి భార్య తనతో తరుచూ గొడవపడేది. దీంతో వారి వైవాహిక జీవితం అసంతృప్తిగా సాగుతోంది.

Lovers

ఈ క్రమంలో శనివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన కరణ్‌తో అతని భార్య గొడవకు దిగింది. ఈ సమయంలో భార్యను సముదాయించడానికి కిరణ్ ఓ లిప్ కిస్ ఇచ్చాడు. అప్పటికే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న భార్య, అదునుచూసి అతని నాలుకను కొరికేసింది. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన కరణ్‌ వెంటనే తేరుకుని, సఫ్టర్ జంగ్ ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. కరణ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం అతడు మాట్లాడలేకపోతున్నట్టు పోలీసులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలోనే కరణ్‌ ఉన్నాడని, బాధితుడు ఫిర్యాదు మేరకు భార్యపై ఐపీసీ సెక్షన్ 326 కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. కరణ్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశామని, అయితే మాట్లాడే స్థితిలో లేడని వైద్యులు పేర్కొన్నారు.