కరోనా సమయంలో భార్యాభర్తల మధ్య పగలు, ప్రతీకారాలు ఎక్కువైపోయాయి. ఏకంగా భర్త ఉద్యోగాన్నే ఊడగొట్టించేసి భార్య విడాకులివ్వాలని ఒత్తిడి చేస్తుంది. ఉత్తరప్రదేశ్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదేమంటే.. భర్త ఉద్యోగం పోయి ఇంటి వద్ద ఉంటే ఇంటి ఖర్చులకు డబ్బులు కావాలంటూ ఒత్తిడి చేసింది భార్య. లేకపోతే విడాకులివ్వాలంటూ వాదనకు దిగడంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. అదేమంటే.. విడాకులు కావాలని డిమాండ్ చేసిన భార్యని దారుణంగా కొట్టి చంపేశాడు కసాయి భర్త. ఆమెకి ఇతరులతో అక్రమ సంబంధాలున్నాయని అనుమానిస్తుండడంతో.. భార్య విసిగిపోయి భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది.
అయితే అందుకోసం తనకు విడాకులు కావాలని.. భర్త పై ఒత్తిడి తెచ్చింది. ఈలోగా తన ఉద్యోగం కూడా పోవడంతో దానికి కూడా భార్యే కారణమని భావించి కిరాతకంగా కొట్టి చంపేశాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఠాకూర్గంజ్ పరిధిలోని గుల్షాన్ విహార్ కాలనీకి చెందిన మహ్మద్ అహ్మద్.. భార్య, ముగ్గురు పిల్లలతో కలసి నివాసం ఉంటున్నాడు. కొద్దికాలంగా తన భార్య ఇతరులతో అక్రమ సంబంధం నెరుపుతోందని అహ్మద్ అనుమానిస్తున్నాడు. దీంతో ఈ ఘటనపై ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. అదే సమయంలో అతని ఉద్యోగం కూడా పోయింది.
అయితే తాను తనకు సమీప బంధువైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నదని భార్యను వేధించాడు. అతని సాయంతో తన ఉద్యోగం కూడా ఊడగొట్టించిందన్న అనుమానంతో భర్తి రగిలిపోయాడు. ఉద్యోగం లేక ఇంటి వద్దనే ఉంటున్న భర్తని ఇంటి ఖర్చులకు డబ్బులు కావాలంటూ రోజూ భార్య ఒత్తిడి చేయడంతో ఏకంగా తీవ్ర ఆవేశానికి లోనైన భర్తి ఇనుపరాడ్డుతో భార్యను తలపై బలంగా బాదాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేయగా పిల్లలు అనాధలుగా మారారు.