నిద్రిస్తోన్న భర్తపై సలసలకాగే నూనె పోసిన భార్య.. తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తుంటే… మనుషుల పైశాచిక ఆనందాలు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. దంపతుల మధ్య వైరం ఘోరానికి దారితీసింది. తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో తాజాగా భర్తపై వెంకటేశ్వరమ్మ కోపం పెంచుకుంది. నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా వేడి నూనె కుమ్మరించింది.

అయితే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో భర్తపై వెంకటేశ్వరమ్మ కోపం పెంచుకుంది. నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా వేడి నూనె మొగుడిపై పోసేసింది. గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు మండలం వెల్లటూరుకి చెందిన మోపిదేవి విజయకుమార్, వెంకటేశ్వరమ్మ దంపతులు తరుచూ గొడవలు ఆడుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా ఆ గొడవలు ముదిరాయి. కుటుంబ కలహాలతో భర్తపై కోపం పెంచుకున్న భార్య వెంకటేశ్వరమ్మ దారుణానికి పాల్పడింది. భర్త నిద్రపోతున్న సమయంలో మరుగుతున్న వేడి నూనెను అతనిపై పోసింది. కాలుతున్న నూనె ఒంటిపై పడడంతో విజయకుమార్‌కి తీవ్రగాయాలయ్యాయి.

క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు ఉదయాన్నే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒంటిపై తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతన్నారు.