Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకే పార్టీగా, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కమ్యూనిస్టు.. ఆ తర్వాత ముక్కలు ముక్కలైపోయి తొమ్మిది పార్టీలుగా మనుగడ సాగిస్తోంది. ఒకే సిద్ధాంతం ఉన్న పార్టీలు విడివిడిగా పోటీ చేయడం ద్వారా.. క్రమంగా తమ రాజకీయ ప్రాబల్యం కోల్పోయి తోక పార్టీలుగా మిగిలాయి. దీంతో ఇప్పుడు కామ్రేడ్లకు మెల్లగా జ్ఞానోదయమైంది. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసిపోయి.. గతంలో మాదిరిగా కమ్యూనిస్టు పార్టీ అయితేనే.. మళ్లీ బలం పుంజుకుంటామని భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత నుంచి విలీన చర్చలు జరుగుతున్నా ఇంతవరకూ కొలిక్కిరాలేదు. పైగా సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవం సుధాకర్ రెడ్డి అయితే అసలింతవరకూ చర్చలు మొదలే కాలేదని, వచ్చే ఐదేళ్లలో విలీనం ఉండొచ్చని చెబుతున్నారు. విలీనానికి అంత టైమెందుకని కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. నాయకుల పంచాయితీ తేలేసరికి అసలు లెఫ్ట్ పార్టీలు అంటే ఏంటని జనం అడుగుతారేమోనని కార్యకర్తలు భయపడుతున్నారు.
సీపీఐ, సీపీఎం ఇప్పటికైనా ఇగోలు పక్కనపెట్టి ఫ్రాంక్ గా చర్చలు జరపాలని, అప్పుడే అందరికీ భవిష్యత్తు ఉంటుందని క్యాడర్ చెబుతోంది. ఇప్పటికైన సంప్రదాయ పార్టీలతో పొత్తులు వదిలేసి. ముందు లెఫ్ట్ శక్తులన్నీ ఏకమవ్వాలని, అప్పుడు ఆటోమేటిగ్గా ఓఠుబ్యాంకు పెరిగి, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. నేతలు. కానీ విలీనానికి ఐదేళ్లు పడుతుందని సీపీఐ మాత్రమే చెప్పింది. అసలు సీపీఎం అయితే ఆ ఊసే ఎథ్తడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విలీనం కలగానే మిగిలిపోతుందని క్యాడర్ భయపడుతోంది.
మరిన్ని వార్తలు