దిల్ రాజ్ సెంటిమెంట్ పనిచేస్తుందా…?

Will Dil Raju Reach The Sentiment Again

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజ్ ఒక్కరు. ఏదైనా సినిమాను టేక్ అప్ చేశాడు అంటే అది కచ్చితంగా సక్సెస్ ను అందుకుంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అండ్ హీరోలోను ఉంటుంది. అంత నమ్మకం అతను అంటే అందుకే దిల్ రాజ్ తో సినిమా అనగానే కచ్చితంగా చూడవచ్చు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. గత సంవత్సరం దిల్ రాజ్ బ్యానర్ నుండి శ్రీనివాస కళ్యాణం, లవర్ సినిమాలు పరాజయంను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ట్ కొట్టాలని అనిల్ రావి పూడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఇంతకు ముందు వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు సుప్రీమ్, రవి తేజతో రాజా ది గ్రేట్ సినిమాలు మంచి విజయాని సాదించి పెట్టాయి. అందుకే దిల్ రాజ్ అనిల్ ను నమ్ముతున్నాడు. అనిల్ రావి పూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోగా ఎఫ్2 అనే మల్టిస్టార్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ అండ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్సు వచ్చింది. ఎఫ్2 చిత్రాని సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుధల చేస్తున్నాడు. సక్సెస్ నిర్మాతగా పేరు ఉన్న దిల్ రాజ్ సంక్రాంతి సెంట్ మెంట్ ను మరోసారి నమ్ముతున్నాడు. ప్రతి సంక్రాంతికి ఓ సినిమాను విడుధల చేయ్యడం దిల్ రాజ్ కు అలవాటు అలా వచ్చిన సినిమాలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, శతమానంభవతి సినిమాలు మంచి విజయాని దక్కించుకున్నాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవ్వుతూ ఎఫ్2 వచేస్తుంది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటి పడుతుండగా ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, పెట్టా సినిమాలు భరిలో ఉన్నాయి వాటికీ పోటిగా ఎఫ్2 వచ్చేస్తుంది. అనిల్ రాఘవ పూడి ఆ చిత్రాని పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. కావున దిల్ రాజ్ గట్టి నమ్మకంతో సినిమా సక్సెస్ అవ్వుతుంది అనే భావనలో ఉన్నాడు. ఆ చిత్రంలో వరుణ్ సరసన మేహ్రిన్, వెంకటేష్ సరసన తమన్నా నటిస్తున్నారు. కీలక పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు.