Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమాయకురాలైన ఆడబిడ్డ మీద ప్రేమోన్మాది దాడి, ప్రేమించలేదని కామపిశాచి ఘాతుకం, ప్రేమ తిరస్కరించిందని అమ్మాయి పై యాసిడ్ దాడి అంటూ నిత్యం మీడియాలో ఇలాంటి వార్తలు దాదపు చూస్తూనే ఉంటాం. కానీ ఒక అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి ఆత్మహత్య అనే వార్తలు ఎప్పుడయినా మీరు చూశారా. చూడరు ఎందుకంటే మహిలు మహిళా సంఘాలు ఇది పురుషాధిక్య సమాజమని చెవి కోసిన మేకల్లా గగ్గోలు పెడుతున్నా ఇది పురుషాదిక్య సమాజం కాదు స్త్రీ పక్షపాత సమాజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఎందుకంటే ప్రేమించలేదని యువతీ గొంతు కోసిన ప్రేమోన్మాది అని రాసిన చేతులే ఒకమ్మాయి చేతిలో మోసం చేయబడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే మాత్రం. ప్రేమ విఫలమయి యువకుడు ఆత్మహత్య అని రాస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం స్త్రీ పక్షపాత సమాజంలో ఉన్నాం కాబట్టి.
నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది…దయ చేసి అమ్మాయిలను నమ్మెద్దు అంటూ కుర్రాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే దిక్కేది. ఒకమ్మాయి అబ్బాయి మోసం చేసాడని ఆత్మహత్య చేసుకుంటే ఆ అబ్బాయి అంతు చూసి వాడిని జైల్లో పెట్టేదాకా నిద్రపోని ఈ మహిళా సంఘాలు ఒకమ్మాయి మోసం చేసి ఒకబ్బాయి మరణిస్తే మరలా ఆ అమ్మాయి తరపునే వకాల్తా పుచ్చుకుని కేస్ ఉండకుండా ఉండేదుకు ప్రయత్నిస్తారు. తాజాగా మంచి జీతం , సెక్యుర్డ్ లైఫ్ ఉండి కూడా ప్రేమ విఫలం అయ్యింది అంటూ దారుణంగా ప్రాణాలు తీసుకున్న ఘటన బండ్లగూడలో జరిగింది. ఈ యువకుడి తల్లిదండ్రుల ఆవేదన చూసేవారికి సైతం కన్నీళ్లు తెప్పించాయి.
హైదరాబాద్ బండ్లగూడకి చెందిన యతీష్… విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మంచి జీతం. నాలుగేళ్లుగా ఓ అమ్మాయి ప్రేమలో ఉన్నాడు. ఇంట్లో వారికి కూడా చెప్పాడు. పెళ్లికి యతీష్ కుటుంబం కూడా ఓకే అన్నది. అయితే రెండు నెలల క్రితం అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ విషయంపై ఆమెను నిలదీశాడు యతీష్. పెళ్లికి ఇంట్లో వారు ఒప్పుకోవటం లేదని చెప్పింది ఆ అమ్మాయి. ఇంట్లో వారు చూపించిన సంబంధమే చేసుకుంటానని… నా పెళ్లి నా చేతుల్లో లేదని చెప్పింది. యతీష్ గుండె బద్దలయ్యింది, ఇంట్లో వాళ్ళని ఎలాగోలా ఒప్పిద్దామనే ఆలోచనతో ఆమని నెల రోజుల క్రితం కలిశాడు, ఈ సమయంలో మరో యువకుడి ప్రేమలో ఉన్నట్లు గుర్తించాడు. ఆమె ఆ అబ్బాయితో కలిసి వెళ్లటం చూశాడు. ఈ విషయంపై నిలదీశాడు. ఇంట్లో వాళ్లు చెప్పిన సంబంధం చేసుకునేటప్పుడు మరో అబ్బాయితో ఎలా తిరుగుతావ్… నాలుగేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎందుకు మోసం చేశావ్ అని అమ్మాయిని నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అమ్మాయి చేసిన మోసం అందుకు ఆమెని ప్రశ్నించినందుకు ఆమె అన్న మాటలతో మనోవేదనకు గురైన యతీష్… బుధవారం రాత్రి… ఉప్పల్ HMDA లే-ఔట్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని మరీ చనిపోయాడు. ఎందుకు చనిపోతున్నది లేఖలో వివరంగా రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులు రోదన చూసేవారికి కన్నీళ్లు తెప్పించింది. జీవితమనేది మనదొక్కరిదే కాదు, మనల్ని కని, పెంచి, పోషిస్తున్న అమ్మానాన్నలది కూడా. మనమీద మనకెంత హక్కుందో తల్లిదండ్రులకూ అంతే హక్కుంది. యుక్త వయసు విపరీతాలకు లోనవడం సహజం. అయితే నిరంతరం మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రేమైనా, విలాసాలైనా కాస్త ఆగి, ఆలోచించి అందులోని మంచిచెడులను సరిచేసుకుంటూ వెళ్ళాలే కాని ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎంతో కష్టపడి చదివించాం అని… మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడని అనుకున్నాం… ఇంత పని చేస్తాడు అనుకోలేదంటూ వారు పెడుతున్న కన్నీటిని తుడవడం అక్కడున్న ఎవరి తరం కాలేదు. నిజమే యతీష్ చనిపోయే ముందు ఒక్కసారి అమ్మను గుర్తుకు తెచ్చుకుని ఉంటె బతికే వాడేమో !