దారుణం… డాక్టర్ని చెట్టుకు కట్టేసి భార్య కూతురి మీద గ్యాంగ్ రేప్.

Woman And Daughter Gang-Raped in Bihar

నేరాలకు, గ్యాంగ్ స్టర్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన బీహార్ లో మరో దారుణం చోటుచేసుకుంది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే రఫీగంజ్-గయా రోడ్డుపై జనసంచారంలేని చోట మాటువేసిన దుండగులు ఓ డాక్టర్ కుటుంబాన్ని చిద్రం చేశారు. చెట్టుకు డాక్టర్ కాళ్లూ చేతులూ కట్టేసి… ఆయన భార్యను అపహరించి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు.

బుధవారం సాయంత్రం డాక్టర్ తన భార్య, కుమార్తెను తీసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ లోని సొంధియా ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో డాక్టర్ అయిన తండ్రి, తల్లి, కుమార్తె(12) ముగ్గురూ బైక్ పె వెళ్తున్నారు. తండ్రి గయలోని గురారు బజార్ లో వైద్యుడిగా పని చేస్తున్నాడు. క్లినిక్ ను మూసాక భార్య, కుమార్తెతో కలసి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని నిర్మానుష ప్రాంతంలో మరణాయుధాలు కలిగిన 20 మంది వారిని చుట్టుముట్టారు. డబ్బులు, నగలు తీసుకుని తమను వదిలేయాలని ప్రాధేయపడినా వినలేదు. తన భార్య, కుమార్తెను వారు చెరబట్టే ప్రయత్నం చేస్తుండగా వారిని ఎదుర్కొనేందుకు డాక్టర్ యత్నించాడు. దీంతో, అతన్ని చెట్టుకు కట్టేసి, గన్ తో బెదిరించి ఓ పొలంలోకి తోసేశారు. ఆయన భార్యను, కుమార్తెను అపహరించి సోనిధ్ అనే గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అక్కడ తల్లీకూతుళ్లపై కామాంధులు అత్యాచారం జరిపారు.

ఈ దారుణంపై సమాచారం అందగానే గయా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోనిధ్ సహా పరిసర గ్రామాలను జల్లెడపట్టి 20 మంది అనుమానితులను అరెస్టు చేశారు. తాము అదుపులోకి తీసుకున్న 20 మందిలో ఇద్దర్ని తల్లి గుర్తుపట్టిందని పోలీసులు తెలిపారు. 11 మంది నిందితులను నిన్న అర్ధరాత్రే అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారిని ఈ ఉదయం అరెస్ట్ చేశారు. కాగా ఇదే అల్లరిమూక డాక్టర్ కుటుంబానికంటే ముందు మరో ఇద్దరు విద్యార్ధులపై దాడికి పాల్పడిందనీ… వారి వద్ద మొబైల్ ఫోన్లు, డబ్బులు లాక్కున్నారని పోలీసుల అనుమానం.