ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లిన భర్త ఊరికి వచ్చాడు. భార్య ఫోన్ తీసుకుని.. చూస్తూ ఉన్నాడు. ఇంతలో మహిళ భయపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతకు ఫోన్‌లో ఏముంది..? ఆమె ఎందుకు భయపడి ప్రాణాలు తీసుకుంది..? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో శోభారాణి అనే మహిళ బేకరీ షాపు నిర్వహిస్తోంది. భర్త నరసింహులు ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుండగా.. ఆమె ఇద్దరు పిల్లలో స్థానికంగా నివాసం ఉంటోంది. అయితే ఆదివారం కర్ణాటక నుంచి వచ్చి భర్త.. బేకరీ షాపులో భార్య ఫోన్ తీసుకుని చూస్తూ ఉన్నాడు. ఈలోపు భయపడి పోయిన శోభారాణి.. ఇంటికి హడావుడిగా వెళ్లిపోయింది.
ఇంటికి వెళ్లిన శోభారాణి వెంటనే ఉరి వేసుకుంది. బేకరీలో ఉన్న నరసింహులు ఇంటికి వచ్చి తలుపులు తీయగా ఒక్కసారిగా షాక్ తగిలింది. భార్య ఉరివేసుకుని కనిపించడంతో వెంటనే కిందకు దించాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను తరలించినా.. ఆసుపత్రికి వెళ్లేలోపు మరణించింది.
తనకల్లు మండలం మరాలపల్లికి చెందిన వెంకటరమణ.. శోభారాణికి దూరపు బంధువు. ఆమెను అతను గత కొద్ది రోజులుగా లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్నట్లు తెలిసింది. శోభారాణి అందుకు నిరాకరించగా.. అతను ఆమె ఫోన్ నిత్యం మెసేజ్‌లు పంపుతున్నట్లు సమాచారం.
సడెన్‌గా భర్త ఫోన్ తీసుకోవడంతో మెసేజ్‌లు చూస్తే ఏమవుతుందోనని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆమె మరణ వార్త విన్న వెంకటరమణ కూడా ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి తండ్రి ఆదినారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.