World Cup 2023: ‘టైమ్డ్ ఔట్’ వివాదంపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

World Cup 2023: Ashwin's sensational comments on the 'timed out' controversy
World Cup 2023: Ashwin's sensational comments on the 'timed out' controversy

ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ వివాదంపై టీమ్ ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. రెండువైపులా న్యాయం ఉందని అభిప్రాయపడ్డారు. ‘హెల్మెట్ సమస్య ఉండటంతో సమయాన్ని తీసుకోవడం మాథ్యూస్ కోణంలో సరైనదే. బ్యాటింగ్ కు వచ్చేందుకు సమయం మించడంతో బంగ్లా కెప్టెన్ షీకీబ్ అంపైర్లకు అప్పీలు చేయడం కూడా రూల్స్ ప్రకారం కరెక్టే. ప్రభావితమైంది మాత్రం మాథ్యూసే’ అని అశ్విన్ స్పష్టం చేశారు.

కాగా… వరల్డ్ కప్ 2023 లో భాగంగా శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టైం ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే ఔట్ అయ్యాడు శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్.. సమరవిక్రమ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. హెల్మెట్ క్లిప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తప్పించుకున్నాడు. అయితే… అప్పటికే టైం ఔట్ అని అప్పీల్ చేశాడు బంగ్లా కెప్టెన్ షకీబ్. బంగ్లా తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటే మాథ్యూస్ బ్యాటింగ్ చేయొచ్చు అని చెప్పారు ఎంపైర్లు. కానీ బంగ్లా తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో బ్యాటింగ్ చేయకుండానే ఔట్‌గా వెనుదిరిగాడు మాథ్యూస్.