ఇవాళ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ భారత్ జట్ల మధ్య 33వ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ ముంబై లోని వంకాడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటిలాగే ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ కు వెళ్తుంది.
జట్ల వివరాలు…
భారత్ XI: రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(w), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
శ్రీలంక XI: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (c & wk.), సదీర సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.