Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈమద్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను కోరుకోకుండానే వివాదాస్పదం అవుతున్నాడు. గతంలో వర్మ ఏం చేసినా కూడా వివాదాస్పదం అయ్యేలా చేసేవాడు. కాని ఇప్పుడు మాత్రం ఆయన వివాదం వద్దనుకున్నా కూడా వివాదం అయ్యి తీరుతుంది. ఆమద్య శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయించాడు. ఆ వ్యాఖ్యలు తనను వివాదంలోకి లాగుతాయని ఆయన ఊహించలేదు. కాని అనూహ్యంగా ఆ విషయంలో వర్మ బలి అయ్యాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆఫీసర్’ సినిమా ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన ఒక నిర్మాణ సంస్థ వర్మ తమకు డబ్బు ఇవ్వాలని, ఆ డబ్బు ఇచ్చే వరకు ఆఫీసర్‌ను విడుదల కానివ్వొద్దు అంటూ పిటీషన్ దాఖలు చేసింది. దాంతో సినిమా విడుదలపై స్టే విధించడం జరిగింది.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ఆఫీసర్’ కథ తనది అంటూ ఒక రచయిత న్యాయ పోరాటంకు సిద్దం అయ్యాడు. తాను రాసుకున్న ఒక కథను ఆమద్య వర్మకు వినిపించడం జరిగింది. ఆ కథను తన అనుమతి లేకుండా ఆఫీసర్‌గా తెరకెక్కించాడు అంటూ రచయిత జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తాను వర్మపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దం అయినట్లుగా ఇటీవలే మీడియా ముందుకు వచ్చి వెళ్లడి చేశాడు. వర్మ తన కథను చోరీ చేయడం అనైతికం అని, కనీసం తనకు క్రెడిట్ ఇవ్వడం ఆయన పేరు వేసుకోవడం ఆయన ప్రవర్థనకు అద్దం పడుతుందని జయకుమార్ అన్నాడు. నాగార్జున వద్దకు ఈ విషయాన్ని తీసుకు వెళ్లగా స్పందించేందుకు నిరాకరించారు అంటూ ఆయన పేర్కొన్నాడు.