షియోమీ చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ కొత్త స్మార్ట్ వాచ్‌ను చైనాలో “ఎంఐవాచ్” అనే పేరుపైన తీసుకువచ్చింది. ఎంఐవాచ్లో 78ఇంచుల అమోలెడ్ టచ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆపిల్ వాచ్‌కు దీటుగా ఫీచర్లను అందించబోనున్నారు.
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను వాచ్ డిస్ప్లేకు అందించనున్నారు. ఎంఐ వాచ్ పది రకాల స్పోర్ట్స్ యాక్టివిటీలను ట్రాక్ చేయగల సామర్త్యం కలిగి ఉండి 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను షియోమీ ఇవ్వనుంది. ఇందులో 8జీబీ స్టోరేజ్‌ను, స్నాప్‌డ్రాగన్ వియర్ 3100 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, వియర్ ఓఎస్, 4జీ ఇ-సిమ్‌కు సపోర్ట్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
దీనిలో 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2ఎల్ఈ, హార్ట్‌రేట్ సెన్సార్, బారో మీటర్, స్విమ్ ప్రూఫ్, ఎన్ఎఫ్సీ, 570 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఇవ్వనున్నారు.ఆండ్రాయిడ్, ఐఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ధర 13125 రూపాయలు ఉండగా త్వరలో భారత్‌లో లాంచ్ చేయనున్నట్టు సమాచారం.