Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాలలో పదిహేను రోజులు జగన్ తిష్టవేసి ప్రచారం చేసినా పని కాలేదని సర్వేలు చెబుతున్నాయి. పైగా టీడీపీ మెజార్టీ కూడా 15 నుంచి 20 వేల వరకూ ఉంటుందనే అంచనాలున్నాయి. అలాంటిది ఇప్పుడు కాకినాడలో ప్రచారానికే జగన్ దూరమయ్యారు. నంద్యాలలో హెక్టిక్ ప్రచారంతో అలిసిపోయిన జగన్ జ్వరం బారిన పడ్డారు. దీంతో కాకినాడ టూర్ వాయిదా పడింది.
అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం కాకినాడలో రెండ్రోజుల పాటు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జగన్ రాకుండా బాబు ప్రచారం చేస్తే.. మరింత ఏకపక్షంగా ఓట్లు పడతాయేమోనని వైసీపీ కంగారుపడుతోంది. ఎలాగైనా జగన్ ను రప్పించాలన్న ప్రయత్నాలు చేయడం మంచిది కాదని డాక్టర్లు ఇప్పటికే చెప్పేశారట. పైగా వైసీపీ సీనియర్లు కూడా తాము కదలకుండా మొత్తం జగన్ నే తిప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని క్యాడర్ ఆగ్రహంగా ఉంది.
అగ్రనేతతో ఇంపార్టెంట్ ప్లేసుల్లో ప్రచారం చేయించాలని కానీ.. మొత్తం ఇల్లిల్లూ తిప్పడమేంటని కార్యకర్తలు మండిపడుతున్నారు. అసలు అంత తిరిగినా ఫలితం ప్రతికూలంగా వస్తే.. అధినేత పరువు పోతోందని, నంద్యాల నేతల స్వార్థం కోసం తమ నాయకుడ్ని బలి పెడుతున్నారని కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారు. ఇదే విషయాన్ని జగన్ సన్నిహితుల దగ్గరకూ తీసుకెళ్లారట. కార్యకర్తల అభిప్రాయం విని.. వారు కూడా నాలుక్కరచుకున్నారు.
మరిన్ని వార్తలు: