Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనం ఒకరివైపు వేలెత్తి చూపితే నాలుగు వేళ్ళు మన వైపు తిరిగి ఉంటాయి . ఇది అందరికీ తెలిసిన పాత నానుడి . అయినా ఒక్కసారి కూడా వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఈ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా కూడా ఇలాంటి విషయమే వైసీపీని భుజాన మోస్తున్న వారి మతిమరుపును ప్రపంచానికి చాటి చెప్పింది.
మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద జనసేన ప్రధాన కార్యాలయం ఏర్పాటు కాబోతోంది. అందుకోసం భూమిని కొనుగోలు చేయలేక లీజు పద్ధతిలో భూమిని తీసుకుని కార్యాలయ ఏర్పాటుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. దీన్ని కూడా వైసీపీ అనుకూల సోషల్ మీడియా టార్గెట్ చేసింది. అక్కడ భూమి కొనలేదు కాబట్టి జనసేన తాత్కాలిక టెంట్ వేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేస్తోంది. నిజానికి ఓ రెండు నెలల ముందు వైసీపీ కూడా విజయవాడలో పార్టీ నేతకు చెందిన భూమిలో తాత్కాలిక కార్యాలయం నిర్మించింది. అది కూడా ప్రధాన ప్రతిపక్షం హైదరాబాద్ నుంచి వచ్చి రాజకీయాలు చేస్తోందని అధికారపక్షం పదేపదే విమర్శలు చేసాక .
సొంత పార్టీ వాళ్ళు ఏ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వైసీపీ విజయవాడలో ఆఫీస్ పెట్టింది . అయితే ఇప్పటికీ ఆ ఆఫీస్ నుంచి జగన్ పెద్దగా కార్యకలాపాలు సాగించింది లేదు. మొత్తం హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచే నేటికీ వ్యవహారాలు నడుస్తున్నాయి . ఈ వ్యవహారాన్ని గాలికి వదిలేసి కొత్తగా వస్తున్న పార్టీ తాను కీలక పాత్ర పోషించదలుచుకున్న చోట పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే అది పర్మినెంట్ కాదని గోల చేయడం, గేలి చేయడం ఏ మాత్రం సమర్ధనీయమో ఆ గొప్ప వాళ్ళు ఆలోచించుకోవాలి .