Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- యోగా గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- యోగాకు ఆద్యులు పరమశివుడట
- యోగా అన్న పదం సంస్కృతం నుంచి పుట్టింది. దీని అర్థం కలయిక లేదా సంయోగం అని. మానవుని శారీరక, బౌద్ధిక, ఆత్మిక కోణాలన్నింటినీ సమగ్రంగా సంయోగపరచి స్థిరమైన, సంతృప్తికరమైన, ఉత్పాదక జీవితాన్ని సాధించేందుకు, ఆధ్యాత్మికంగా ఈశ్వరునితో ఏకమయ్యేందుకు దోహదం చేసేదే యోగ.
- భారత దేశంలో పుట్టిన యోగ ప్రాచీన గ్రంథాలన్నింటిలోనూ దర్శనమిస్తుంది.
- యోగుల సంభాషణల నుంచి పుట్టిందే యోగ అనే వాదనా ఉన్నది. అందుకే ఇది అత్యంత ప్రాచీనమైందని చెప్పవచ్చు.
- పురాణాల ప్రకారం యోగా విద్యను శివుడు తన పత్ని పా ర్వతికి ముందుగా వివరించి అనంతరం సమాజానికి వివరించాడుట.
- పతంజలి యోగ సూత్రాలు ఆధ్యాత్మికత లోతులను స్పృశిస్తాయి.
- సంస్కృతంలో ఆసనమనే పదానికి అర్థం భంగిమ.
- ప్రాథమికంగా ఆసనాలు ఎనభై నాలుగు ఉన్నాయి. అయితే ఏ ఆసనం ప్రత్యేకత దానిదే. ప్రతి దానికీ ఒక పేరు, చేయవలసిన పద్ధతి ప్రత్యేకంగా ఉంటాయి.
- ఏది ఏమైనా యోగ ద్వారా వ్యక్తి ప్రశాంతతను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని సాధించవచ్చని ఆధునిక శాస్తవ్రేత్తలు కూడా అంగీకరిస్తున్నారు.
- యోగా..రెండక్షరాల పదం. ఇందులోనే శత కోటి శతఘు్నల బలం. ఆధునిక మానవ జీవితానికి పరమౌషధం.
వైద్య శాస్త్రం దగ్గర్నుంచి విజ్ఞాన శాస్త్రం దాకా ముక్త కంఠంతో యోగాకు యోగ్యతా పత్రం ఇచ్చాయి. - ఊపిరి సలుపని జీవితానికి నిండు ఊపిరి… సకల దేహ దురవస్థలకు… అనారోగ్యాలకు ఈ యోగా దివ్యౌషధం.
- ఈ యోగా మహిమ వలన రెండువేల ఏళ్లగా మహావతార్ బాబాజీ సజీవంగా ఇప్పటికీ జీవిస్తున్నారని యోగా సాధకులు నమ్ముతారు.