Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూర్య నమస్కారం అనేది, యోగాసనాలలో ఉన్న ముఖ్యమైనదిగా చెప్పచ్చు. ఈ యోగాసనంను రోజు అనుసరించటం వలన అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఇందులో ఉండే ప్రతి దశ నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉంటుంది అందుకే ఆచరించే సమయంలో పూర్తి ఏకాగ్రతతో చేయాలి. సుర్యనమస్కారాలలో మొత్తం పన్నెండు స్టెప్స్ ఉన్నాయి.
స్టెప్ 1
ఈ భంగిమలో సూర్యుడి వైపు నిలబడి, మీ చేతులను నమస్కార భంగిమలోకి తీసుకురండి లేదా చేతులను ముడిచి చాతి దగ్గర ఉంచండి, దాదాపు చాతిని తాకించే భంగిమలో ఉంచండి. గాలిని లోపలి పీలూస్తూ చేతులను భుజాల వారకి తీసుకురండి మరియు గాలిని భయటకు వదిలే సమయంలో చేతులను చాతి వద్దకు తీసుకురండి.
స్టెప్ 2
గాలిని పీలూస్తూ, మీ చేతులను సూటిగా ఉంచి, వాటిని పైకి లేపండి.
స్టెప్ 3
మీ మోకాళ్లను నిటారుగా ఉంచి, నడుమును వంచి, కాలి వెళ్ళను అరచేతులతో తాకటానికి ప్రయత్నించండి. ఈ ప్రక్రియ శ్వాస తీసుకుంటూ చేయాలి, అంతేకాకుండా, శ్వాస వదులుతూ యధా స్థానానికి రావాలి.
స్టెప్ 4
మీ ఎడమ కాలిని వెనకకు లాగండి, తరువాత మీ అరచేతులను నేలపై ఉంచి, తలను పైకెత్తి సూర్యుడిని చూడండి. ఈ భంగిమ అనుసరించే సమయంలో శ్వాస తీసుకోండి.
స్టెప్ 5
మీ చేతులను నేలపై ఉంచి, కుడి కాలును ముందుగానూ మరియు ఎడమ కాలును వెనుకగానూ ఉంచి, వంగి ఉండండి, ఈ భంగిమలో చేతులు కాళ్ళు నిటారుగా ఉండేలా జాగ్రత్త పడండి మరియు ఈ భంగిమ కొనసాగించే సమయంలో శ్వాస తీసుకోండి.
స్టెప్ 6
నేలపై పడుకొని, పాదాలు, మోకాళ్ళు, తొడలు, చాతి మరియు తల అన్ని శరీర భాగాలు నేలకు తాకించి పడుకోండి. తరువాత మీ తలను కుడి మరియు ఎడమ వైపులకు తిప్పుతూ, చెవులను నేలకు తాకించండి. ఈ భంగిమలో కూడా శ్వాస తీసుకోండి.
స్టెప్ 7
మీ తలను ఎట్టి, అరచేతులను నేలపై తాకించి, సాధ్యమైనంత వరకు నడుమును పైకి ఎత్తండి. ఈ భంగిమ అనుసరించే సమయంలో కూడా గాలిని పీల్చండి.
స్టెప్ 8
మరలా స్టెప్ 5 ని రిపీట్ చేయండి
స్టెప్ 9
మరలా స్టెప్ 4 ని రిపీట్ చేయండి
స్టెప్ 10
మరలా స్టెప్ 3 ని రిపీట్ చేయండి
స్టెప్ 11
మరలా స్టెప్ 2 ని రిపీట్ చేయండి
స్టెప్ 12
మరలా స్టెప్ 1 ని రిపీట్ చేయండి
ఇక్కడ తెలిపిన ఆసనాలు ప్త్రత్యేక విశిష్టత కలిగి ఉన్నా , ఆసనాలను అనుసరించే ముందు యోగా నిపుణుల వద్ద శిక్షణ తీసుకోవటం మరవకండి. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు వూరికే అనలేదు సుమీ… నిపుణుల పర్యవేక్షణ లేకుండా చేస్తే కండరాలు పట్ట్టేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్త