గుంటూరులో లాఠీ ఝులుం.. యువకుడు మృతి

ఏపీలో పోలీసు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లో ఈ లాక్ డౌన్ వేళ్ చాలా దారణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. పోలీసుల దెబ్బలు తాళలేక ఓ యువకుడి మృతి చెందాడు. మెడికల్ షాప్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న మహమ్మద్ గౌస్ అనే యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి మృత్యువాత పడ్డాడు.

సత్తెనపల్లిలోని వెంకటపతి కాలనీకి చెందిన మహమ్మద్ గౌస్ ఈరోజు ఉదయం 8.30 గంటల సమయంలో మెడికల్ షాప్‌కి వెళ్లి కొన్ని మందులు కొనుగోలు చేశాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. అతడిని పోలీసులు ఆపి చితక్కొంటారు. ఏమాత్రం కారణం కూడా తెలుసుకోకుండా కొట్టడంతో గౌస్ అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. దీంతో పోలీసులే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. అరగంట తర్వాత గౌస్ మృతి చెందాడు. అయితే గౌస్‌కు గుండె జబ్బు ఉందని.. పోలీసుల కొడుతున్న సమయంలో ఆందోళనకు గురై గుండెనొప్పితో మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం అనుమతి ఉన్న సమయంలో మందుల కోసం బయటకు వచ్చిన గౌస్‌ను ఎందుకు కొట్టారంటూ స్థానికులు పోలీసులపై విరుచుకు పడుతున్నారు. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఐజీ ప్రభాకర్‌రావు స్పందించారు. పోలీసులు గౌస్‌ను కొట్టలేదని.. బయటకు ఎందుకొచ్చావని నిలదీస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని స్పష్టం చేశారు. కాగా అతడికి గతంలోనే గుండె జబ్బు ఉందని.. పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో భయానికి గురికావడంతో గుండెనొప్పి వచ్చి చనిపోయాడని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేస్తున్నట్లు ఐజీ వివరించారు.