కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో దేశమంతా లాక్ డౌన్ పాటించింది. దీంతో జనాలకు రోడ్లపైకి రానివ్వకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా దక్షిణ ముంబైలో ఓ వ్యక్తి రోడ్డుమీదకు వచ్చాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆపేందు ప్రయత్నించారు. దీంతో అతను వాహనాన్ని అదుపు చేయలేక పోలీసును బైక్ తో పాటు ఈడ్చుకు వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారైన ఘటనలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
కాగా ఖాజాబీ షేక్ నయీమ్ అనే వ్యక్తి తాజాగా వాడిబండర్ గుండా బైక్ పై వెళ్తున్నాడు. ఆ సమయంలో ఏఎస్‌ఐ విజేంద్ర ధూరత్ బండి ఆపాల్సిందిగా ఆ బైకర్ కు సూచించాడు. అప్పటికే వేగంగా వెళ్తున్న నయీమ్.. బైకును ఆపకుండా విజేంద్రను 50 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అలెర్ట్ అయిన నయీంను పోలీసులు.. వెంబడించి పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సెక్షన్ 353(ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కల్గించడం లేదా గాయపరచడం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయాలపాలైన ఏఎస్‌ఐ విజేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.