ఉన్నత విద్య కోసం యూకే వెళ్లిన ఆ యువకుడు సెలవులకు ఇంటికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి యూకేలో ఎంఎస్ చేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అక్కడ సెలవులు ఇవ్వడంతో సొంతవూరికి వచ్చాడు. వచ్చే నెలలో తిరిగి యూకేకు వెళ్లాల్సివుంది.
మల్కాజిగిరిలో ఉంటున్న తన స్నేహితుడు రాహుల్‌ను కలవడానికి బుధవారం తన బైక్ మీద మల్కాజిగిరికి వస్తుండగా ఆర్.కె.నగర్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో హర్షవర్ధన్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన పై అతని సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.