Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దివంగత నేత వై.ఎస్ తో కేవీపీ కి వున్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన బతికి వున్నప్పుడు జగన్, కేవీపీ లు మామాఅల్లుడు అని పిలుచుకునేవాళ్ళు. ఆ తర్వాత పరిణామాలతో సీన్ మారిపోయినా ఇటీవల ఈ మామాఅల్లుళ్ళ మధ్య సఖ్యత ఏర్పడింది. అందుకే పేరుకి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే జగన్ కి అనుకూలంగా వైసీపీ ప్రయోజనాలు కాపాడేందుకు కేవీపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పాత వై.ఎస్ మిత్రులందర్నీ ఓ చోట చేర్చి జగన్ కి అనుకూలంగా పని చేయిస్తున్నారు. ఆ ప్లాన్ లో కీలక పాత్ర పోషిస్తోంది ఉండవల్లి, రఘువీరా అని తెలుస్తోంది. అటు కాంగ్రెస్ హైకమాండ్ కి జగన్ తో పొత్తు కుదురుస్తామని చెప్పి ఒప్పించారు. అయితే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ వ్యవహారశైలిని 10 జన్ పద్ పసిగట్టింది. అందుకే కేవీపీ, రఘువీరా మాటలు పక్కనబెట్టి ఏపీ లో రాజకీయ పరిణామాల్ని నివేదించమని ఓ సీక్రెట్ టీం ని ఆంధ్రాకి పంపింది. ఆ టీం సేకరించిన సమాచారం ప్రకారం 2019 ఎన్నికల నాటికి జగన్ ఇంకా బలహీనపడతాడు. ఆ టీం కాంగ్రెస్ నేత జై రామ్ రమేష్ కనుసన్నల్లో పని చేసిందట.
జైరాం రమేష్ నివేదిక అందగానే కాంగ్రెస్ హైకమాండ్ అలెర్ట్ అయ్యిందట. కేవీపీ, రఘువీరా మీద దృష్టి సారించిందట. ఆ ఇద్దరూ తెలివిగా నంద్యాల ఉపఎన్నికల్లో జగన్ కి మేలు చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టకుండా వ్యూహం పన్నుతున్నట్టు అర్ధం చేసుకుందట. వెంటనే కర్నూల్ సీనియర్ నాయకుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ని సంప్రదిస్తే ఆయన పార్టీ అభ్యర్థిని నిలబెడితే మంచిదని సూచించారట. మైనారిటీ అభ్యర్ధికి టికెట్ ఇస్తే ఇప్పటికి ఇప్పుడు మేలు జరగకపోయినా బీజేపీ తో అంటకాగుతున్న వైసీపీ కి దూరమైన వర్గాలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటాయని సలహా ఇచ్చారట. ఆ తర్వాత రఘువీరా ఏమి చెప్పినా వినిపించుకోకుండా నంద్యాల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలని హైకమాండ్ ఆదేశాలు ఇచ్చిందట. దీంతో నంద్యాల ఉపఎన్నికల విషయంలో కాంగ్రెస్ కళ్లుగప్పుదామని ట్రై చేసిన మామాఅల్లుళ్లు కేవీపీ, జగన్ ప్లాన్ రివర్స్ అయ్యింది.
మరిన్ని వార్తలు: