Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమైక్యాంధ్ర ఉద్యమంలో హీరో, విభజన తర్వాత జీరో అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్నాళ్లుగా వైసీపీ కి ఎంతగా కొమ్ము కాస్తున్నారో అంతా చూస్తూనే వున్నాం. టీడీపీ ని గద్దె దించి జగన్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు తహతహలాడుతున్నారు. పార్టీలో కనీసం చేరకుండానే ఈ స్థాయిలో సేవలు అందిస్తున్న ఉండవల్లిని చూసి జగన్ తెగ పొంగిపోయారట. అందుకే ఆయనకి ఊహించని ఆఫర్ తో ఉక్కిరిబిక్కిరి చేద్దామని డిసైడ్ అయ్యారట. అదే ఆఫర్ చెప్పి ఓ పెద్దాయన ని ఉండవల్లి దగ్గరికి పంపిస్తే ఆయన ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావడం అటుంచి భయంతో ఉలిక్కిపడ్డారట. ఇంతకీ జగన్ ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా ?
వైసీపీ కి ఆయువుపట్టు లాంటి రాయలసీమలోనే ఆ పార్టీ కంచుకోటలు బీటలు వారుతుంటే ఇక కోస్తాలో ఎలా వుందో వేరే చెప్పాలా. ఈ పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించడానికి సమర్థులైన ఎంపీ అభ్యర్థులు ఉంటే కొంత మేలు జరుగుతుందని జగన్ అనుకుంటున్నారట. అందుకే దానికి తగ్గ అభ్యర్థుల కోసం వేట మొదలుపెడితే రాజమండ్రి దగ్గరికి వచ్చే సరికి బండి ముందుకు కదలలేదంట. అటు చూస్తే రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం టీడీపీ లో మురళీమోహన్ తో పోటీ పడేవాళ్ళు చాలా మంది. ఇటు వైసీపీ లో ఆ టికెట్ అడిగిన నాధుడే లేడు. ఈ పరిస్థితుల్లోనే పార్టీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపీ గా పోటీ చేస్తే అన్ని ఖర్చులు మేమే భరాయిస్తామని ఉండవల్లికి జగన్ ఇచ్చిన ఆఫర్ అట. అయితే ఈ మాట వినగానే ఉండవల్లి ఉలిక్కిపడ్డారట. వై.ఎస్ ఉంటేనే 2009 లో గెలుపు అతి కష్టం అయ్యింది, ఇక ఇప్పుడు వైసీపీ కి గట్టి బలగము లేని చోట నేను పోటీ చేస్తే ఓటమి తప్పదని ఉండవల్లి మొహం మీదే చెప్పేశారట. కాకుంటే పార్టీకి మేధోపరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారట. ఆ సంగతి తర్వాత ఇప్పుడు రాజమండ్రి ఎంపీ కాండిడేట్ ముందు ఎవరో తేల్చుకోడానికి జగన్ నానా అగచాట్లు పడుతున్నారంట.